ఉప్పెన.. సునామీ లాంటి విజయం.. వంద కోట్ల వరద ఖాయం !


కొద్దిరోజులుగా టాలీవుడ్ లో మారుమ్రోగిపోతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. వైష్ణవ్ తేజ్-కృతీ శెట్టి జంటగా నటించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. మైత్రీ మూవీస్ నిర్మించింది. ప్రచార చిత్రాలతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చిన ఉప్పెన ఆ అంచనాలని నిజం చేసింది. ‘ఉప్పెన’పై పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో చిత్రబృందం సెలబ్రేషన్స్ మొదలెట్టింది. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఇది సునామీ లాంటి విజయం. మళ్ళీ చెప్తున్న ఇది వంద కోట్ల సినిమా’ అన్నారు. ఉప్పెన పరువు-ప్రతిష్ట నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. దర్శకుడు కథని బాగా డీల్ చేశాడు.  విజయ్ సేతుపతి నటన, సంగీత, సినిమాటోగ్రఫీ, క్లైమాక్స్ ఏపీసోడ్స్ హైలైట్ గా నిలిచాయని రివ్యూలు చెబుతున్నాయి.