కాజల్ ని కోరుకుంటున్న తారక్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకి చందమామ కాజల్ బాగా గుర్తోస్తోంది. వీరిద్దరు మరోసారి కలిసి కోరుకుంటున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తారక్-కాజల్ లది హిట్ కాంబో. వీరిద్దరు తొలిసారి ‘బృందావనం’ సినిమా కోసం కలిసి నటించారు. ఆ తర్వాత బాద్ షా, టెంపర్ సినిమాల కోసం జోడీ కట్టారు. టీంపర్ సినిమా రిలీజై నేటితో ఆరేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో అభిమానులు టెంపర్ ఇంపాక్ట్ ని గుర్తు చేసుకుంటున్నారు.

పనిలో పనిగా తారక్ తో కాజల్ మరోసారి జతకడితే చూడాలని ఉందనే కోరికని బయటపడుతున్నారు. కాజల్ ఇటీవలే పెళ్లి చేసుకొంది. పెళ్లైన ఇంకా ఫామ్ లోనే ఉంది. వరుస సినిమాలు చేస్తోంది. ప్రస్తతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తోంది. ఆమె నటిస్తున్న భారతీయుడు 2 షూటింగ్ కొన్ని కారణాల వలన ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక కాజల్ నటించిన లైవ్ టెలికాస్ట్ హాట్ స్టార్ లో నిన్నటి నుంచే స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో కాజల్ బోల్డ్ ఎంట్రీ.. బోల్డ్ నటనతో అదరగొట్టేసిందని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’తో బిజీగా ఉన్నారు. ఇందులో కొమరం భీమ్ గా కనిపించనున్నారు. ఆయనకి జోడిగా హాలీవుడ్ హీరోయిన్ ఒలివియా మోరీస్ నటించనుంది. ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్ సినిమా ఉండనుంది. ఈ రెండు సినిమాల తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తారక్ సినిమా చేయనున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీస్ నిర్మించనుంది.