Breaking : ఇంగ్లాండ్’తో రెండో టెస్టులో.. రోహిత్ సెంచరీ !  

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్టుల్లో మరోసారి హిట్ అయ్యాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో తొలి ఇన్నింగ్స్ లో రోహిత్ (100* బంతుల్లో) సెంచరీ బాదాడు. మొదటి నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ ఇంగ్లండ్ బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 150 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. క్రీజులో రోహిత్ తో పాటు రెహానె (25) ఉన్నారు.

టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ మొదటి బ్యాటింగ్ ఎంచుకున్నారు. అయితే తొలి ఓవర్ లోనే టీమిండియా షాక్ తగిలింది. యువ ఓపెనర్ గిల్ పరుగుల ఖాతా తెరవకుండానే పెలివియన్ చేరాడు. విరాట్‌ కోహ్లీ(0) అనూహ్య రీతిలో ఔటయ్యాడు. జట్టు స్కోర్‌ 85 పరుగుల వద్ద పుజారా(21) ఔటైన తర్వాతి ఓవర్‌లోనే కెప్టెన్‌ సైతం పెవిలియన్‌ చేరాడు. దీంతో భారత్‌ 86 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అయితే రోహిత్ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డ్ ని ముందుకు నడిపిస్తున్నారు.

రెండో టెస్టులో భారత్‌ మూడు మార్పులతో బరిలోకి దిగింది. తొలి టెస్టులో బ్యాట్‌తో అదరగొట్టి బంతితో విఫలమైన వాషింగ్టన్‌ సుందర్‌ స్థానంలో అక్షర్‌ పటేల్‌ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు తొలి టెస్టులో పూర్తిగా విఫలమైన నదీమ్‌కు బదులు ఈ మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను తీసుకున్నారు.