ఇంకోసారి ఇంకోసారి.. అంటున్న టక్ జగదీష్ !

టక్ జగదీష్ ఇంకోసారి ఇంకోసారి.. అంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రమిది. రీతూ వర్మ హీరోయిన్. మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. Shine Screens బ్యానర్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 23న టక్ జగదీష్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలెట్టింది చిత్రబృందం. మొదటి పాటలో ‘ఇంకోసారి ఇంకోసారి..’ పాటని విడుదల చేశారు. ఈ పాటకు చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించారు. శ్రేయా ఘోషాల్, కాల భైరవ కలిసి పాడారు. పాట చాలా క్లాస్ గా ఉంది. విజువల్స్ లో నాని-రీతూ వర్మ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఇంకోసారి ఇంకోసారి చాన్నాళ్లు ప్రేక్షకుల నోళ్లలో నానేలా ఉంది. ఈ పాటని మీరు ఓసారి వినేయండీ.. !