కేజీఎఫ్2 శాటిలైట్ @50 కోట్లు

రాకీ భాయ్ గా యష్ నటిస్తున్న ‘కేజీఎఫ్ ఛాప్టర్-2’ సినిమాకు మార్కెట్ అమాంతం పెరిగింది. మొదటి సినిమాతో పోలిస్తే, సీక్వెల్ కు ఊహించిన దానికంటే దాదాపు 70 శాతం ఎక్కువగా బిజినెస్ జరుగుతోంది. ఈ మూవీకి సంబంధించి సౌత్ శాటిలైట్ డీల్ క్లోజ్ అయింది. ఓ ప్రముఖ ఛానెల్ 50 కోట్ల రూపాయలకు దక్కించుకుంది.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించి డిజిటల్ రైట్స్ ఆల్రెడీ అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దాదాపు 55 కోట్ల రూపాయలకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ (అన్ని భాషలతో కలుపుకొని) దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇక హిందీ డబ్బింగ్, హిందీ శాటిలైట్స్ రైట్ కోసం జీ గ్రూప్ గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ సినిమాలో సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ లాంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.