సిల్క్‌స్మిత’గా శ్రీరెడ్డి.. ఇంకేమైనా ఉందా.. ??

హాట్ బ్యూటీ శ్రీరెడ్డి అభిమానులకి గుడ్ చెప్పారు. దివంగ‌త న‌టి సిల్క్‌స్మితబయోపిక్‌ చేస్తున్నానని, మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని ఆమె కోరుకుంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ చిత్రానికి మధు దర్శకత్వం వహించనున్నారు. తెలుగు, తమిళం భాషల్లో విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తానని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

వాస్తవానికి సిల్క్‌స్మిత బయోపిక్ లో హాట్ యాంకర్ అనసూయ నటిస్తారనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలని ఆమె ఖండించారు. ఫైనల్ గా సిల్క్ పాత్ర కోసం శ్రీరెడ్డిని ఫిక్సయింది. సిల్క్ పాత్రలో శ్రీరెడ్డి ఫర్ ఫెక్ట్ సెలక్షన్ అని అంటున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు, మాటలతోనే ఉడికించే శ్రీరెడ్ది.. సిల్క్ పాత్రలో బోల్డ్ గా నటిస్తే తట్టుకోగలరా ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

బాలీవుడ్‌లో 2011లో డర్టీ పిక్చర్‌ పేరుతో  తెర‌కెక్కిన‌ సిల్క్‌ స్మిత బయోపిక్‌లో నటి విద్యాబాలన్‌ నటించారు. ఆ పాత్ర ఆమెకి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. మరీ.. శ్రీరెడ్డికి కూడా సిల్క్ మంచి పేరు తీసుకొస్తుందేమో చూడాలి. శ్రీరెడ్ది మంచి నటి. కానీ నిరూపించుకొనేందుకు ఆమెకి తగిన అవకాశాలు రాలేదంటారు. ఇప్పుడు సిల్క్ స్మిత బయోపిక్ రూపంలో ఆమెకు బంపర్ ఆఫర్ దక్కిందని చెప్పవచ్చు.