వైరల్ : రోహిత్ షాట్.. కోహ్లీ కామెంట్ !

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైఎస్ కెప్టెన్ రోహిత్ శర్మ (వన్డే)ల మధ్య సరైన సఖ్యత లేదనే ప్రచారం ఉంది. ఆసీస్ తో రెండో టెస్ట్ కు రోహిత్ అందుబాటులోకి రాగానే.. కోహ్లీ పితృత్వ సెలవులపై ఇంటికి వెళ్లారని చెప్పుకుంటారు. కానీ మేం ఆడేది దేశం కోసం.. మా మధ్య ఎలాంటి విబేధాలు లేవని తాజాగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ లో కోహ్లీ నిరూపించారు.

తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా యువ ఓపెనర్ పరుగుల ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే ఇన్నింగ్స్‌ మూడో ఓవర్‌లో స్టువర్ట్‌ బ్రాడ్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ తన ట్రేడ్‌మార్క్‌ షాట్‌ అయిన కవర్‌ డ్రైవ్‌తో పరుగుల ఖాతాను ఆరంభించాడు. రోహిత్‌ షాట్‌ను డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్న కోహ్లి చూసి యస్‌ బాయ్‌.. కమాన్‌ రోహిత్‌.. యూ క్యాన్‌ డూ ఇట్‌ అంటూ బిగ్గరగా అరవడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇక అదే ఊపులో రోహిత్ సెంచరీ పూర్తి చేశాడు. ప్రస్తుతం 131 పరుగులతో ఆటని కొనసాగిస్తున్నాడు. రోహిత్ కి తోడుగా రెహానె (35) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం టీమిండియా 3 వికెట్ల నష్టానికి 187 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది.