బిగ్ సప్రైజ్ : అఖిల్-మోనాల్ జంటగా సినిమా.. టైటిల్ ఏంటో తెలుసా ?

బిగ్ బాస్ అభిమానులకి బిగ్ సప్రైజ్. బిగ్ బాస్ హౌస్ లో రొమాన్స్ చేసిన అఖిల్-మోనాల్.. అదే రొమాన్స్ ని బిగ్ స్కీన్ పై కొనసాగించనున్నారు. అవునూ.. వీరిద్దరు జంటగా సినిమా ప్రకటన వచ్చేసింది. ‘తెలుగు అబ్బాయి-గుజరాత్ అమ్మాయి’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. మోషన్ పోస్టర్ ని కూడా వదిలారు.ఈ చిత్రానికి భాస్కర్ బంటుపల్లి దర్శకత్వం వహించనున్నారు. భాస్కర్ రావు నిర్మాత. మోషన్ పోస్టర్ ని కలర్ ఫుల్ గా డిజైన్ చేశారు.

బిగ్ బాస్ 4లో అఖిల్-మోనాల్ ల రొమాన్స్ హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. మొదట్లో ఇటు అఖిల్ అటు అభిజిత్ తోనూ రొమాన్స్ చేసిన మోనాల్.. ఆ తర్వాత మాత్రం అఖిల్ సైడ్ నే టర్న్ తీసుకుంది. వీరి ముద్దులు-హగ్గులతో బిగ్ బాస్ 4 రొమాంటిక్ గా సాగింది. ఇక బిగ్ బాస్ తర్వాత మోనాల్ నటిగా బిజీ అయింది. వరుసగా తెలుగు సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి. ఇదీగాక.. టీవీ షోస్ చేస్తోంది. తనతో పాటు అఖిల్ కి బ్రేక్ ఇచ్చే ప్రయత్నాల్లో మోనాల్ ఈ సినిమా చేస్తున్నట్టు కనిపిస్తోంది.