#RRR బిగ్ అప్ డేట్


ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పటికే #RRR రిలీజ్ డేటుని చెప్పేశారు. ఈ యేడాది అక్టోబర్ 13న సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో #RRR ప్రీ రిలీజ్ బిజినెస్ హాట్ కేకుల్లా జరిగిపోతోంది. తాజాగా తమిళనాడు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ క్లోజ్ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య అప్ డేట్ ఇచ్చారు. @LycaProductions తమిళనాడు ఆర్ ఆర్ ఆర్ రైట్స్ తీసుకుందని ట్విట్ చేశారు. అయితే ఎంత రేటుకి అన్నది మాత్రం చెప్పలేదు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న చిత్రమిది. స్వాత్రంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల మధ్య గల ఓ కామన్ పాయింట్ ఆధారంగా దర్శకుడు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కథని రాసుకొన్నారు. ఇందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్.. ఆయనకు జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఇక కొమరంభీమ్ పాత్రలో తారక్.. ఆయనకి జంటగా హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ నటిస్తున్నారు.