తెరాస నేతలని ఆకర్షిస్తున్న రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తోంది. ప్రజలు మాత్రమే కాదు.. తెరాస నేతలు కూడా రేవంత్ రెడ్డికి ఆకర్షితులు అవుతుండటం విశేషం. మంత్రి కేటీఆర్ కు సన్నిహితుడు, ఆయన్ని చిచ్చా అని పిలుచుకునే పద్మారావు సైతం రేవంత్ రెడ్డి నాకు దగ్గరోడు అని చెప్పుకొనే దాకా పరిస్థితి వచ్చింది. అవునూ.. రేవంత్ రెడ్డి నాకు దగ్గరోడు అంటూ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం లాలాపేటలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదును ప్రారంభించి పద్మారావు గౌడ్‌ మాట్లాడుతున్నసమయంలో.. లాలాపేట మీదుగా తార్నాక వైపు రేవంత్‌రెడ్డి వాహన శ్రేణీ ర్యాలీ వెళుతోది. దీంతో పద్మారావు గౌడ్‌.. తన ప్రసంగాన్ని ఆపి అటు వైపు చూస్తూ..  రేవంత్‌ ఉన్నాడా ? ఆయన నాకు బాగా దగ్గరోడు అంటూ కామెంట్స్ చేశారు. పద్మారావు చేసిన వ్యాఖ్యలు.. సభలో ఉన్నవారిని ఆశ్చర్యానికి గురిచేశాయ్. రేవంత్ రెడ్డి అంటే.. సీఎం కేసీఆర్, తెరాస పార్టీకి బద్ద శత్రువుగా చూస్తుంటారు. అలాంటి రేవంత్ రెడ్ది పద్మారావుకి దగ్గరోడా ? రాజకీయ నేతలు అంతా ఓకే టూన్ లో ఉంటారు. ప్రజలే అమాయకులని అక్కడ వారి గుసగుసలాడుకున్నట్టు సమాచారమ్.

మరోవైపు వైఎస్ఆర్ మనిషి, ఆయన వ్యక్తిగత సహాయకుడు సూరీడు.. సడెన్ రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రత్యక్షమయ్యారు. రేవంత్ తో కలిసి సూరీడు ఫోటో తీసుకున్నాడు. దీంతో.. వైఎస్ ఆర్ అభిమానుల సపోర్ట్ రేవంత్ రెడ్ది ఉందనే ప్రచారం మొదలైంది. అంతేకాదు.. రేవంత్ రెడ్డి తెలంగాణ వైఎస్ఆర్ అని కూడా చెప్పుకొంటున్నారు. వైఎస్ ఆర్ కూడా పాదయాత్ర ద్వారానే ప్రజలకు దగ్గరైన సంగతి తెలిసిందే. పాదయాత్రలో ప్రజల కష్టాలని చూసి.. ఆ తర్వాత వారి కోసం అద్భుతమైన పథకాలని ప్రవేశపెట్టారు. గొప్ప సీఎం అనిపించుకున్నారు. ఇప్పుడు.. రేవంత్ రెడ్డి  కూడా వైఎస్ ఆర్ మాదిరిగానే పాదయాత్రతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మరీ.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయేమో చూడాలి.