ఫ్లాష్ : టెస్టు క్రికెట్’కు రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్


దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్ అభిమానులకి సడెన్ షాక్ ఇచ్చారు. టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ మేరకు డుప్లెసిస్ తన ఇన్ స్టా గ్రాములో పోస్ట్ పెట్టాడు. 69 టెస్ట్ మ్యాచ్ లు ఆడిన డుప్లెసిస్ 4,163 పరుగులు చేశాడు.

అతడి ఖాతాలో 10 టెస్ట్ సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో డిప్లెసిస్ అత్యధిక పరుగులు 199. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు.

ఇక టెస్ట్ లకు మాత్రమే రిటైర్మెంట్ ప్రకటించిన డుప్లెసిస్ వన్డే, టీ20ల్లో మాత్రం దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇక ఐపీఎల్ లో డుప్లెసిస్ చెన్నై తరుపున ఆడుతున్న సంగతి తెలిసిందే.