బుచ్చి కోసం ముగ్గురు స్టార్ హీరోలు

బుచ్చిబాబు.. ఈ మధ్య మారుమ్రోగిన పేరు. దర్శకుడు సుకుమార్ శిష్యుడు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఉప్పెన’ సినిమా దర్శకుడు. రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఉప్పెన.. ఆ అంచనాలని నిజం చేసింది. అంచనాలని మించిన కలెక్షన్స్ రాబడుతోంది. కేవలం మూడ్రోజుల్లోనే రూ. 50కోట్లు తెచ్చిపెట్టింది. ఉప్పెన ఉగ్రరూపం చూస్తుంటే వంద కోట్లు గ్యారెంటీ అనిపిస్తోంది.

ఇక బుచ్చిబాబు సనా రెండో సినిమా కూడా మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఉండనుంది. ఉప్పెన హిట్టైయితే బుచ్చికి స్టార్ హీరోని ఇస్తామని మైత్రీ నిర్మాతలు హామీ ఇచ్చారు. అంతేకాదు.. ఈ స్టార్ హీరోల జాబితాలో తారక్, చరణ్, ప్రభాస్ ఉన్నారు. వీరిలో ఒకరిని బుచ్చిబాబుకి ఇస్తామని హామీ ఇచ్చారట. ఈ నేపథ్యంలో బుచ్చిబాబు రెండో సినిమా ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు.. ఇప్పటికే తన రెండో సినిమా స్క్రిప్ట్ ని బుచ్చి పూర్తి చేశాడట. ఇదో స్పోర్ట్స్ డ్రామా. 1980లోని స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. మరీ.. బుచ్చి రాసుకొన్న స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు తారక్, చరణ్, ప్రభాస్ లలో ఎవరు ఓకే చెబుతారు ? అన్నది చూడాలి.