న్యాయవాదుల హత్య కేసు : ఆ ముగ్గురిప ఎఫ్ఐఆర్

పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల వద్ద బుధవారం న్యాయవాదులు గట్టు వామన్‌రావు (49), నాగమణి(45) దంపతులు దారుణహత్యకు గురైన విషయం తెలిసిందే. కారులో హైదరాబాద్‌ వస్తుండగా మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిపై పట్టపగలే నరికి చంపిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.

ఈ కేసులో వామన్‌రావు తండ్రి కిషన్‌రావు ఫిర్యాదు మేరకు 120బి, 302, 341, 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఎ-1గా వెల్ది వసంతరావు, ఎ-2గా కుంట శ్రీనివాస్‌, ఎ-3గా అక్క పాక కుమార్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.కత్తిపోట్ల అనంతరం రోడ్డుపై పడి ఉన్న వామన్‌రావును స్థానికులు ‘ఎవరు హత్యా యత్నం చేశార’ని ప్రశ్నించగా ‘కుంట శ్రీనివాస్‌’ అనే పేరు చెప్పడం వీడియోలో వినిపించింది.