అల్లరోడిని ఏడిపించిన హిట్ టాక్


కష్టాలు మాత్రమే కాదు. ఆనందం కూడా మనిషి ఏడిపిస్తుంటుంది. వాటినే ఆనంద బాష్పాలు రాల్చడం అంటాం. శుక్రవారం అల్లరోని నరేష్ కూడా ఆనందంలో ఏడ్చేశాడు. ఆయన నటించిన ‘నాంది’ సినిమా శుక్రవారం రిలీజైంది. హిట్ టాక్ సొంతం చేసుకొంది. మాములు హిట్ కాదు. నరేష్ కెరీర్ లోనే గొప్ప సినిమా అని చెప్పుకుంటున్నారు. ఈ ఆనందంలో మీడియా ముందుకొచ్చిన నరేష్ ఏడ్చేశాడు.

2012లో ‘సుడిగాడు’ వచ్చింది. అదే నా ఆఖరి హిట్. ఆ తర్వాత మళ్లీ హిట్ కొట్టాడానికి 8యేళ్లు పట్టిందని అల్లరోడు ఎమోషన్ అయ్యాడు. మనల్ని కడుపుబుబ్బ నవ్వించే అల్లరోడు ఏడిస్తే ఏం బాగుంటుంది. అందుకే ఆయన తేరుకొని నవ్వేశాడు. ప్రేక్షకులకి కృతజ్ఝతలు చెప్పాడు. నాందితో నరేష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఇకపై కామెడీ సినిమాలు మానేసి.. ఇలాంటి డిఫరెంట్ సినిమాలు చేయాలని అభిమానులు కోరుతున్నారు.

ఇక నాందికి మంచి టాక్ మాత్రమే కాదు. మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయ్. ఇప్పటికే నిర్మాత సేఫ్ అయ్యాడు. ఆహా సినిమాకి `నాంది` ఓటీటీ రైట్స్ ద‌క్కాయి. ఓటీటీ రూపంలో.. స‌గం పెట్టుబ‌డి తిరిగి వ‌చ్చిన‌ట్టు టాక్‌. శాటిలైట్, హిందీ డ‌బ్బింగ్ రైట్స్ అన్నీ క‌లుపుకుంటే… నిర్మాత సేఫ్ జోన్‌లో ఉన్న‌ట్టే. థియేట‌ర్ ద్వారా వ‌చ్చేదంతా ఇప్పుడు బోన‌స్ చెబుతున్నారు.