ఇలా ‘చెక్’ పెట్టబోతున్నాం

చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ నటించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ కథానాయికలు. ఈ నెల 26న చెక్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన దర్శకుడు చంద్రశేఖర్ ఏలేని సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు.

‘చెక్’ సినిమాలో స్క్రీన్-ప్లే అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో హీరో ఒక ఉరిశిక్ష పడ్డ ఖైదీ, బాగా తెలివైన వ్యక్తి. అనుకోకుండా ఒక పెద్ద ప్రమాదంలో జైలులో పడితే ఉరిశిక్ష పడిపోతుంది. ఇప్పుడు నాలుగు గోడల మధ్య ఇరుక్కుపోయాడు. అక్క‌డ త‌న తెలివితేట‌ల్ని స‌రైన దారిలో ఉప‌యోగించుకునే అవ‌కాశం వ‌స్తే ఏం చేశాడ‌న్న‌దే క‌థ‌.  ఈ  కథలో చదరంగం ఆటకు చాలా  ప్రాముఖ్యం ఉంటుందని చెప్పుకొచ్చారు.

70 శాతం సినిమా జైలులో సాగుతుంది. నిజానికి స్క్రిప్టు ప్ర‌కారం ఇంకా త‌క్కువే ఉండాలి. కానీ కరోనా వల్ల బయటకు వెళ్లలేక జైలు సీక్వెన్సులు కొంచెం పెంచాల్సి వచ్చింది. రకుల్ ది న్యాయవాది పాత్రే. కాకపోతే… బేసిగ్గా భయస్తురాలు. భయస్తురాలు నుంచి ధైర్యవంతురాలిగా మారుతుంది. క్యారెక్టర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. అటువంటి అమ్మాయి తీవ్రవాది ముద్రపడిన ఓ వ్యక్తి కేసు డీల్ చేయాల్సి వస్తుంది. ప్రకాశ్ వారియర్ పాత్ర‌ ఫ్లాష్‌బ్యాక్‌లో వస్తుంది. ఆ అమ్మాయిదీ చాలా ఇంపార్టెంట్ రోల్. నితిన్ లవ్ ఇంట్రెస్ట్. ఆమె ఎంటర్ అయిన దగ్గర్నుంచి మొత్తం కథ టర్న్ తీసుకుంటుందని ఏలేటి తెలిపారు.