సన్ స్ట్రోక్స్ : ఐపీఎల్’కు వార్నర్ దూరం


సన్ రైజర్స్ హైదరాబాద్ కు గట్టి దెబ్బ తగలనుందని తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ గాయం నుంచి కోలుకోవడానికి మరో 9 నెలల సమయం పట్టనుందట. ఈ విషయాని స్వయంగా వార్నర్ నే తెలిపాడు. ఈ నేపథ్యంలో మరో రెండ్నెళ్లలో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021కి వార్నర్ దూరమయ్య అవకాశాలున్నాయని చెబుతున్నారు.

భారత్‌తో జరిగిన రెండో వన్డేలో వార్నర్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ఫీల్డింగ్ చేస్తుండగా గజ్జల్లో గాయమవ్వడంతో నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత టీ20 సిరీస్‌కు దూరమైనా, టెస్టు సిరీస్‌లో తిరిగొచ్చాడు. ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే ఐపీఎల్ మొదలయ్యేలోపు వార్నర్ కోలుకొనేలా కనిపించలేదు. దీంతో ఈ సారి సన్ రైజర్స్ కి విలియమ్ సన్ కెప్టెన్ గా వ్యవహరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.