హరీష్ రావుకు ఆదర్శంగా నిలుస్తున్న షర్మిల

సీఎం కేసీఆర్ రాజకీయ వారసుడు ఆయన కుమారుడు కేటీఆర్. ఫిబ్రవరిలోనే మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ ప్రచారానికి సీఎం కేసీఆర్ పులిస్టాప్ పెట్టారు. దీని వెనక రాజకీయ కారణాలున్నాయనే ప్రచారం ఉంది. ఇంటిల్ జెంట్ నివేదికని పరిగణలోకి తీసుకొని కేటీఆర్ కు పట్టాభిషేకం చేసే ప్రొగ్రామ్ ని సీఎం కేసీఆర్ వాయిదా వేసినట్టు సమాచారమ్.

మరోవైపు మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే హరీష్ రావు పరిస్థితి ఏంటీ ? అనే చర్చ జరుగుతోంది. ఆయన బయటికొచ్చి పార్టీ పెట్టొచ్చు అనే ప్రచారం కూడా ఉంది. కానీ హరీష్ అందుకు సిద్ధంగా లేడట. దానికి కారణం విధేయతనే. కేసీఆర్ బతికి ఉన్నంతవరకు హరీష్ తోక జాడియడు. కొత్త పార్టీ పెట్టడు అని చెప్పుకుంటున్నారు. అయితే విధేయతని దాటేసి.. ట్రెండ్ సెట్ చేయడంలో హరీష్ రావుకు వైఎస్ షర్మిల ఆదర్శింగా నిలుస్తుందని చెప్పుకుంటున్నారు.

అన్న జగన్ వద్దన్నా.. వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెడుతుంది. భవిష్యత్ లో ఏపీకి ఆమె పార్టీని విస్తరించనుందనే ప్రచారం జరుగుతోంది. అన్న జగన్ తో వచ్చిన విబేధాలే ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. సీఎం జగన్ చెల్లెలే.. ఆయనే విబేధించి కొత్త పార్టీ పెడుతున్నప్పుడు తెలంగాణలో మంత్రి హరీష్ రావు.. మామ కేసీఆర్ ని విబేధించి కొత్త పార్టీ పెట్టుకోవడంలో తప్పులేదని చెప్పుకుంటున్నారు. ఈ లెక్కన షర్మిల హరీష్ రావుకు ఆదర్శంగా నిలిచినట్టే.