‘టక్ జగదీష్’ టీజర్ టాక్

శివ నిర్వాణ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రం ‘టక్ జగదీష్’. నాని జంటగా రీతూ వర్మ నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ఐశ్వర్యా రాజేష్ నటిస్తున్నారు. జగపతి బాబు నానికి అన్న పాత్రలో నటిస్తున్నారు. నాని బర్త్ డే (ఫిబ్రవరి 24) కానుకగా తాజాగా టక్ జగదీష్ టీజర్ ని రిలీజ్ చేశారు. రాయలసీమ జానపదంతో టీజర్ కట్ చేశారు.

డ్రోన్ కెమెరా వ్యూ తో గ్రామాన్ని చూపిస్తూ టీజర్ మొదలైంది. కోడిపందెం.. స్వయంగా కోడిపుంజుకు కాలుకి నానికి కత్తి కడుతుండటం చూపించారు. ఆ వెంటనే జాతర సీన్ తో నాని అండ్ ఫ్యామిలీనీ చూపించారు. పాటతోనే కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలని టచ్ చేశారు. ఆ వెంటనే నానిలోని మాస్ యాంగిల్ చూపిస్తూ.. బుడతపొలంలో ఓ యాక్షన్ బిట్ సీన్. రీతూ వర్మతో ఓ రొమాంటికి సీన్.. ఇలా అన్ని క్లాసు-ఫ్యామిలీ-మాసు.. అన్ని యాంగిల్ ని సింగిల్ టీజర్ లోనే చూపించారు. అయితే టీజర్ మొత్తంలోనూ.. నాని టక్ తోనే కనిపించడం విశేషం.

థమన్ అందించిన నేపథ్య సంగీతం టీజర్ లో హైలైట్ గా నిలిచింది. అయితే త్రివిక్రమ్-తారక్ ల ‘అరవింద సమేత’ మూడ్ లో టీజర్ సాగింది. సినిమా కూడా అలానే ఉంటే.. శివ నిర్వాణ త్రివిక్రమ్ ని కాపీ కొట్టినట్టే. నాని ఎక్స్ ప్రెషన్స్ కూడా అరవిందలో తారక్ ని ఫాలో అయినట్టు అనిపిస్తోంది. అయితే సింగిల్ టీజర్ తో పోలికలు పెట్టలేం. మొత్తానికి.. టీజర్ బాగుంది.