నాల్గో టెస్ట్ : ఇంగ్లండ్ 166/6

భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆఖరి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ 15 పరుగులకే మొదటి రెండు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు జాక్‌ క్రాలే(9), డొమినిక్‌ సిబ్లే(2)లను స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అవుట్ చేశాడు.ఈ దశలో క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్‌(55 121 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. మంచి ఊపు మీదున్న బెన్ స్టోక్స్ ని  సిరాజ్ బొల్తా కొట్టించాడు. కెప్టెన్‌ జో రూట్‌(5) కూడా సిరాజ్ అవుట్ చేశాడు.

ప్రస్తుతం ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులతో ఆటని కొనసాగిస్తోంది. క్రీజులో డి లారెన్స్ 28, ఫోక్స్ 1 ఉన్నారు. భారత బౌలర్లలో సిరాజ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు, సుందర్, అశ్విన్ చెరో వికెట్ తీసుకున్నారు. పిచ్ స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లకు సమానంగా సహకరిస్తుండటం విశేషం.