తెలంగాణలో యేడాదికి కోటి ఉద్యోగాలు.. కానీ కేంద్రం ఎసరు పెడుతోందా.. !!

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయ్. నిరుద్యోగులు, ఉద్యోగులని ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయ్. అయితే నిరుద్యోగులు, ఉద్యోగులు కేసీఆర్ ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో గడిచిన 6 ఆరేళ్లలో లక్షకుపైగా ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇంకా ఖాళీలు ఉన్నాయి. వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈ క్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో యేడాది కోటి ఉద్యోగాలు కల్పించాలని ఉన్నా… దానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎసరు పెడుతోందన్నారు. అంతేకాదు.. ఆరు సంవత్సరాలు ఎంఎల్సీ గా ఉన్న బీజేపీ అభ్యర్థి రాంచందర్ రావు గెలిపించిన పట్టభద్రులకు ఏం చేశారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తలసాని పాల్గొన్నారు. తెరాస ఎంఎల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి తరుపున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యేడాదికి కోటి ఉద్యోగాలు కల్పించాలని ఉన్నా.. కేంద్రం ఎసరు పెడుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరీ.. తలసాని వ్యాఖ్యలపై బీజేపీ నేతల రియాక్షన్ ఎలా ఉండబోతుంది ? అన్నది చూడాలి.