రివ్యూ : ఎ1 ఎక్స్ ప్రెస్ – ఫస్టాఫ్ యావరేజ్, సెకాంఢాఫ్ సూపర్

చిత్రం : ఎ1 ఎక్స్ ప్రెస్

నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, సాషా సింగ్, శ్రీరెడ్డి, పృథ్వీ, శివ శంకర మాస్టర్, రమేష్ తదితరులు

సంగీతం : రాజేష్, నిద్వాన

దర్శకత్వం : భవాని శంకర్ కే

నిర్మాతలు : రాజేశ్వర్ రెడ్డి , కరుణాకర్ రెడ్డి

యువ హీరో సందీప్ కిషన్ నటించిన 25వ సినిమా ‘ఏ1 ఎక్స్ ప్రెస్’. తమిళ్ హిట్  ‘నెప్తే తునయ్’కు రీమేక్ ఇది. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి  డెన్నీస్ జీవన్ కనుకొలను దర్శకత్వం వహించారు. సందీప్ కిషన్ కి జంటగా లావణ్య త్రిపాఠి నటించింది. హీరోగా, నిర్మాతగా సందీప్ కిషన్ కు ఏ1 ఎక్స్ ప్రెస్ ఎలాంటి ఫలితం ఇచ్చింది తెలుసుకోవడానికి రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

యానంలో ఉండే మావయ్య (పోసాని కృష్ణమురళీ) ఇంటికి వెళ్ళిన సంజు (సందీప్ కిషన్) అక్కడి హాకీ ప్లేయర్ లావణ్యతో ప్రేమలో పడతాడు. అయితే… అక్కడి చారిత్రాత్మకమైన చిట్టిబాబు హాకీ స్టేడియంను రాష్ట్ర క్రీడామంత్రి రావు రమేశ్ ఓ కార్పొరేట్ మెడికల్ కంపెనీకి తన స్వప్రయోజనాల కోసం ధారాదత్తం చేయాలనుకుంటాడు. మరి క్రీడాకారులు ప్రాణంగా భావించే ఆ మైదానాన్ని కాపాడుకోగలిగారా? అందుకోసం సంజు ఎలాంటి సాయం చేశాడు? అనేది కథ.

ఎలా ఉందంటే ?

స్పోర్ట్స్ డ్రామాతో తెలుగులో సినిమాలు రావడం చాలా అరుదు. తమిళ్ లో మాత్రం అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయ్. మంచి విజయాన్ని సాధిస్తుంటాయ్. అవే తెలుగులోకి రిమేక్ అవుతుంటాయ్. ఏ1 ఎక్స్ ప్రెస్ కూడా తమిళ్ రిమేక్ నే. మాతృకలో పెద్దగా మార్పులు చేయకుండా.. తెలుగులోకి దించేశారు. కాకపోతే తెలుగు ఫ్లేవర్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 
తొలి భాగంలో సందీప్-లావణ్యల పరిచయం,  ప్రేమ వ్యవహారాలతో సరదాగా సాగుతోంది. కథలో పెద్దగా డెప్త్ కనిపించదు. అయితే సెకాంఢాఫ్ లో మాత్రం కథని గ్రిప్పింగ్ గా నడిపించాడు దర్శకుడు. హాకీ క్రీడకు సందీప్ ఎందుకు దూరమయ్యాడు.. అసలు ఇండియాలో ఆటలు ఆడాలంటే ఎలాంటి పరిస్థితులు ఎదురువుతాయి.. వివక్ష ఎంతటి స్థాయిలో ఉందనే విషయాలను వివరిస్తూ కథనం ముందుకు సాగుతూ ఉంటుంది.

ఇక ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో సందీప్ కిషన్ నటన అదిరిపోతుంది. చివరకు రాజకీయ నాయకుల గురించి చెప్పే మాటలు అందరినీ ఆలోచించేలా చేస్తాయి. ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలోనే కథ వేగంగా బిగిగా సాగుతుందనిపిస్తోంది.

ఎవరెలా చేశారు ?

సినిమాలో సందీప్ కిషన్ ఆల్ రౌండర్ షో చేశాడు. అల్లరి చేసినా, సీరియస్‌గా ఆట ఆడినా, ప్రేమ, యాక్షన్, ఎమోషనల్ ఇలా ప్రతీ సీన్‌లోనూ సందీప్ కిషన్ అదరగొట్టేశాడు. ఇక లావణ్య త్రిపాఠి తన అందం, నటనతో ఆకట్టుకుంటుంది. మిగిలిన పాత్రల్లో మురళీ శర్మ, రావు రమేష్, పోసాని, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తదితరులు తమ తమ పరిధి మేరకు నటించారు. పాటలు వినడానికి ఓ మోస్తారుగా అనిపించినా.. తెరపై చూడ్డానికి  మాత్రం బాగున్నాయ్.

సాంకేతికంగా :

మాతృక సంగీత దర్శకుడు హిప్ హప్ తమిళనే ఈ చిత్రానికి సంగీతం అందించారు. మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు.  సినిమాటోగ్రఫర్ కెవిన్ తమ సత్తాను ప్రదర్శించారు. ఇక ఫస్టాప్ కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంటుంది. ఆ విషయంలో ఎడిటర్ ఇంకాస్త దృష్టిపెడితే బాగుండేది. డైలాగ్స్ బాగున్నాయ్. సెకాంఢాఫ్ కథనం అదిరిపోయింది. 

ప్లస్ పాయింట్స్ :

  • సెకాంఢాఫ్
  • సందీప్ కిషన్ నటన
  • డైలాగ్స్
  • మైనస్ పాయింట్స్ :
  • ఫస్టాఫ్
  • ఊహకందే సన్నివేశాలు
  • ఫైనల్ గా : ఏ1 ఎక్స్ ప్రెస్ – మొదట్లో మెళ్లిగా వెళ్లినా.. ఆ తర్వాత మాత్రం జెడ్ స్పీడుతో దూసుకెళ్లింది 
  • రేటింగ్ : 3/5