బట్టల రామస్వామి బయోపిక్కు : ట్విస్టుల్లోనే కథ ఉంటది

నూతన నటీనటులు ఆల్తాఫ్‌ హాసన్‌, శాంతిరావు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బట్టల రామస్వామి బయోపిక్కు’. గ్రామీణ నేపథ్యంలో ఫన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. ఈ చిత్రానికి రామ్‌ నారాయణ్‌ దర్శకుడు. సతీష్‌కుమార్‌, రామకృష్ణ వీరపనేని నిర్మాతలు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.

‘జీవిత చరిత్రలు పెద్దపెద్ద నాయకులు, సినీ ప్రముఖులకే కాదండి.. మీలాంటి, నాలాంటి మామూలు మనుషులకు కూడా ఉంటాయి` అనే డైలాగ్ బాగా పేలింది. ప్రతి కథలో ట్విస్టులు ఉంటాయ్. కానీ ట్విస్టుల్లోనే కథ ఉంటుందని టీజర్ లో చెప్పించారు. తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకు ఒక బయోపిక్కే డైలాగ్ హైలైట్ అయింది. మొత్తానికి టీజర్ ఎంటర్ టైనింగ్ ఉంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.