వైరల్ : పవన్-రానా సినిమా లీకిడ్ ఫోటో

పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి కథానాయకులుగా మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ తెలుగు రిమేక్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నారు. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయ్. అయితే ఈ సినిమా సెట్స్ మీద  ఉండగానే లీకుల బెడద మొదలైంది. తాజాగా ఈ సినిమా సెట్ నుంచి ఓ పిక్ లీకైంది. ఇప్పుడీ.. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇక పవన్ ఏకంగా నాలుగైదు సినిమాలని లైన్ పెట్టిన సంగతి తెలిసిందే. వకీల్ సాబ్, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలని లైన్ లో పెట్టేశారు. వీటిలో వకీల్ సాబ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం క్రిష్ సినిమాతో పాటు అయ్యప్పనుమ్ కోషియమ్ రిమేక్ లో పవన్ నటిస్తున్నారు. ఈ యేడాది పవన్ నుంచి రెండు, మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.