బన్నీ అభిమానులకు ట్రిపుల్ ట్రీట్

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకి గుడ్ న్యూస్. బన్నీ బర్త్ డే (ఏప్రిల్ 8) రోజున అభిమానులకి ట్రిపుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. సుకుమార్-బన్నీ కాంబోలో హ్యాట్రిక్ చిత్రం ‘పుష్ప’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బన్నీ బర్త్ డే కానుకగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు కొరటాల-బన్నీ కాంబోలో రాబోతున్న సినిమా టైటిల్ ని ప్రకటించనున్నారు. ఈ సినిమాలో బన్నీ స్టూడెంట్ లీడర్, రాజకీయ నేతగా కనిపిస్తారని టాక్.

ఈ రెండు బహుమతులతో పాటు బన్నీ కొత్త సినిమా అప్ డేటు కూడా ఇవ్వనున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎవరు ? అన్నది మాత్రం ప్రస్తుత్తానికి సస్పెన్స్. పుష్ప పాన్ ఇండియా సినిమా తెరకెక్కుతోంది. కొరటాల సినిమా కూడా పాన్ ఇండియా సినిమా వచ్చే అవకాశాలున్నాయ్. ఈ నేపథ్యంలో బన్నీ నుంచి మూడో అప్ డేటు కూడా పాన్ ఇండియా సినిమా అయి ఉంటుందని చెప్పుకుంటున్నారు.