24 గంటల తర్వాత వాట్సాప్ మెసేజ్’లు మాయం

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తుంటుంది. త్వరలో మరో కొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటికే ఉన్న డిజప్పియరింగ్‌ మెసేజెస్‌ ఫీచర్‌లోనే మరో సదుపాయాన్ని చేర్చింది. ఇప్పుడు ఉన్న ఫీచర్‌ ఆధారంగా మెసేజులు వారం రోజుల తర్వాత వాటంతట అవే డిలీట్‌ అయిపోతాయి. 

కానీ, 24 గంటల తర్వాత మెసేజ్‌లు డిలీట్‌ అయిపోయే ఫీచర్‌ను వాట్సాప్‌ త్వరలో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు వాబీటా ఇన్ఫో వెబ్‌సైట్‌ తన ట్విటర్‌ ఖాతాలో తెలిపింది. డిజప్పియరింగ్‌ మెసేజెస్‌తో పాటు ఆర్కైవ్‌ మెసేజెస్‌ ఆప్షన్‌లో కూడా కొన్ని మార్పులు చేయనుంది. ఆర్కైవ్‌ చేసిన కాంటాక్ట్‌ నుంచి మెసేజ్‌ వచ్చినా అన్‌ఆర్కైవ్‌ అవ్వకుండా ఉండే అప్‌డేట్‌ను తీసుకురానుంది. ఈ ఆప్షన్లు మనం ఎనేబుల్‌ చేసుకుంటేనే కాంటాక్ట్ అన్‌ఆర్కైవ్‌ అవ్వకుండా ఉంటుంది.