టీ-పీసీసీ చీఫ్.. రాహుల్ చెప్పిన కొత్త ప్రణాళిక !

తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసె విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఇంకా నాస్తూనే ఉంది. గతంలో రేవంత్ రెడ్డి పేరుని ఖరారు చేసిన అధిషానం.. ఆయన అభ్యర్థిత్వం పట్ల సీనియర్లు గుర్రుగా ఉండటంతో వెనకడుగు వేసింది. ఆ తర్వాత పలువురు పేర్లు తెరపైకి వచ్చినా.. రేవంత్ రెడ్డి, కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే తాజాగా రాహుల్ గాంధీ టీ-పీసీసీ చీఫ్ విషయంలో కొత్త ప్రణాఌకని అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారమ్.

 
తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మధుయాష్కి శుక్రవారం రాహుల్‌ను కలిశారు. ఆ సమయంలో తెలంగాణలో పార్టీ పరిస్థితిపై రాహుల్ తనదైన శైలిలో స్పందించారని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. తెలంగాణలో కేసీఆర్ తీరుపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు పూర్తి స్థాయిలో పనిచేయడంలేదన్న అభిప్రాయాన్ని రాహల్ వ్యక్తం చేసినట్లు సమాచారం.

అదే సమయంలో టీపీసీసీ చీఫ్ ప్రస్తావన తెచ్చినప్పుడు రాహుల్ గతంలోకంటే భిన్నంగా స్పందించారట. టీపీసీసీ కూర్పు విషయంలో సామాజిక న్యాయం పాటించాలని.. ఈ విషయంలో తనకు ఒక ప్రణాళిక ఉందని రాహుల్ చెప్పినట్లు తెలిసింది. అదే నిజమైతే.. టీపీసీసీ పోస్ట్ ని రాహుల్ బీసీ నేతకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.