శర్వానంద్ బర్త్ డే.. చరణ్ గ్రాండ్ పార్టీ !

యువ హీరో శర్వానంద్ పుట్టినరోజు నేడు. ఈ సండర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయ్. శర్వా కూడా అభిమానులకు డబుల్ ట్రీట్ అందజేశారు. ‘మహాసముద్రం’ నుంచి ఫస్ట్ లుక్ తో పాటు ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ సినిమా టైటిల్ పోస్టర్ ని కూడా వదిలారు. ఈ రెండు సినిమాలు కూడా ఈ  యేడాదియే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.


బర్త్ డే సందర్భంగా శర్వానంద్‌కు రామ్‌ చరణ్‌‌ స్పెషల్‌ పార్టీ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను శర్వా తాజాగా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘పార్టీ ఇచ్చినందుకు థ్యాంక్యూ చెర్రీ’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. స్కూల్‌లో ఉన్నప్పుడు చెర్రీ.. శర్వా క్లాస్‌మేట్స్‌. దీంతో వీరిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అందుకే ప్రతి ఏడాది శర్వా పుట్టినరోజుకు చరణ్‌ ప్రత్యేకంగా పార్టీ ఇస్తుంటారు. ఈ యేడాది కూడా శర్వా బర్త్ డేని చరణ్ సెలబ్రేట్ చేశారు.