TS ఎంసెట్ షెడ్యూల్ ఖరారు

తెలంగాణలో ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖారారైంది. ఈ నెల 18వ తేదీన ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఎంసెట్‌ కమిటీ వెల్లడించింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో వంద శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ఎంసెట్‌లో ఇవ్వాలని ఇప్పటికే కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్ పరీక్షల కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

  • ఈ నెల 20 నుంచి మే 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరణ
  • ఆలస్య రుసుంతో జూన్‌ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు 
  • జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్ష నిర్వహణ
  • జులై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు 
  • జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు