‘వకీల్ సాబ్’ ఉమెన్స్ డే పోస్టర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకుడు. థమన్ సంగీతం. దిల్ రాజు నిర్మాత. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వకీల్ సాబ్ నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. నివేదా థామ‌స్‌, అంజ‌లి, అన‌న్య నాగ‌ళ్ల కీలక పాత్రల్లో ఉన్న ఈ పోస్టర్ అల‌రిస్తోంది. 


వారు ముగ్గురు త‌న‌ వెన‌క నిల‌బ‌డ‌గా మ‌హిళ‌ల‌ను కాపాడే అడ్వకేట్ ‌లా ప‌వ‌న్ క‌ల్యాణ్ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఓ చేతిలో బేస్ బాల్ బ్యాట్, మ‌రో చేతిలో న్యాయ‌శాస్త్ర పుస్త‌కం ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్‌లో క‌నప‌డుతున్నారు. గ‌త ఏడాది మార్చి 8న కూడా మ‌హిళా దినోత్స‌వం సందర్భంగా ఈ సినిమా నుంచి ‘మ‌గువా.. మ‌గువా’ అనే పాట విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.