మహిళలకు రెడ్ సెల్యూట్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి-సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘విరాటపర్వం’. నందితా దాస్ , ప్రియమణి, ఈశ్వరీరావు, జరీనా వహాబ్, నివేదా పేతురాజ్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్సవం సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ప్ర‌త్యేక వీడియో విడుద‌లైంది. రానా వాయిస్ ఓవర్ తో మహిళలకు సెల్యూట్ చెప్పారు.

చ‌రిత్ర‌లో దాగిన క‌థ‌ల‌కు తెర లేపిన ప్రేమ త‌న‌దిప్రేమ కూడా మాన‌వ స్వేచ్ఛ‌లో భాగ‌మ‌ని న‌మ్మిన వ్య‌క్తిత్వం ఈమెది మ‌హా సంక్షోభ‌మే గొప్ప శాంతికి దారి తీస్తుంద‌ని న‌మ్మిన విప్ల‌వం ఆమెదిఅడ‌వి బాట ప‌ట్టిన అనేక‌మంది వీరుల త‌ల్లుల‌కు వీళ్లు ప్ర‌తిరూపాలువీళ్ల మార్గం అన‌న్యం.. అసామాన్యం.. అంటూ రానా గొంతుతో.. వీళ్ల‌కు సెట్యూట్ చెప్పారు.  ఈ సినిమాను సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్ఎల్వీ సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. వ‌చ్చేనెల‌ 30న ఈ దీనిని విడుద‌ల చేయ‌నున్నారు.