రివ్యూ : జాతి రత్నాలు

చిత్రం : జాతి రత్నాలు

నటీనటులు : నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా తదితరులు

మ్యూజిక్ : రాధాన్

దర్శకత్వం : అనుదీప్ కేవీ

నిర్మాత : నాగ్ అశ్విన్

నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్ సంగారెడ్డి దర్శకుడు. దర్శకుడు నాగ్ అశ్విన్ కథ-స్క్రీన్ ప్లే అందించారు. నిర్మాత కూడా నాగ్ అశ్విన్ నే. ప్రచార చిత్రాల్లోనే ఫుల్లుగా నవ్వించిన జాతి రత్నాల కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూశారు. శివరాత్రి కానుకగా జాతిరత్నాలు ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చారు. మరీ.. ప్రచార చిత్రాల్లో కనిపించిన కామెడీ డోస్ సినిమాలోనూ ఉందా ? అసలు జాతి రత్నాలు మేటరేంటీ ? తెలుసుకునేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !

కథ :

జోగిపేట్ శ్రీ‌కాంత్ (న‌వీన్ పొలిశెట్టి) ఊర్లో లేడీస్ ఎంపోరియ‌మ్ చూసుకుంటుంటాడు. అయితే త‌న‌కు ఆ ప‌ని న‌చ్చ‌దు. హైద‌రాబాద్ వెళ్లిపోయి జాబ్ చేసుకుందాం అనుకుంటాడు. ఇంట్లో నాన్న (త‌నికెళ్ల భ‌ర‌ణి)తో స‌వాల్ చేసి.. త‌న దోస్తులు (ప్రియ‌ద‌ర్శి, రాహుల్ ర‌మ‌కృష్ణ‌)తో క‌లిసి హైద‌రాబాద్ వ‌స్తాడు. ఇక్క‌డ అనుకోకుండా స్పోర్ట్స్ మినిష్ట‌ర్ చాణిక్య (ముర‌ళీశ‌ర్మ‌) పై హ‌త్యాయ‌త్నం కేసులో.. అరెస్ట్ అవుతారు. సాక్ష్యాల‌న్నీ.. ఈ ముగ్గురు స్నేహితుల‌కు ప్ర‌తికూలంగా ఉంటాయి.

ఈ కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి ఒకటే ఒక మార్గం ఉంది. అదే.. సెల్ ఫోన్‌. ఓ సెల్ ఫోన్‌లో మినిస్ట‌ర్ చాణిక్య‌కి సంబంధించిన ర‌హ‌స్యం దాగి ఉంటుంది. ఆ సెల్ ఫోన్ ఎవ‌రి ద‌గ్గ‌ర ఉంది? అది మ‌న జాతి ర‌త్నాల‌కు దొరికిందా? లేదా?? ఇంత‌కీ చాణిక్య‌ని చంపాల‌నుకున్న‌ది ఎవ‌రు? అన్న‌ది మిగిలిన క‌థ‌.

ఎలా సాగింది ?
ముగ్గురు ఆవారా గాళ్లు – వాళ్లు చేసిన తెలివి త‌క్కువ ప‌నులు – దాన్నుంచి వ‌చ్చిన తిప్ప‌లు – అందులోంచి పుట్టిన న‌వ్వులు వెర‌సి – జాతి ర‌త్నాలు. లాజిక్కులని అసలు పట్టించుకోకుండా నవ్వించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ సినిమా తెరకెక్కించాడు దర్శకుడు. జోగిపేట‌లో జాతిర‌త్నాల అల్ల‌రి ద‌గ్గ‌ర్నుంచి క‌థ మొద‌ల‌వుతుంది. ఆయా స‌న్నివేశాల‌న్నీ హాయిగా సాగిపోతాయి. ప్ర‌తీ డైలాగ్ లోనూ ఏదో ఓ మెరుపు ఉండేలా చూసుకున్నాడు ద‌ర్శ‌కుడు. మినిస్ట‌ర్ పై హ‌త్యాయ‌త్నం కేసులో ఇరుక్కోవ‌డంతో ఇంట్ర‌వ‌ల్ ప‌డుతుంది. అక్క‌డి నుంచి క‌థ క్రైమ్ జోన‌ర్‌లోకి వెళ్తుందేమో అనిపిస్తుంది. కానీ కైమ్ ని కూడా కామెడీ చేసేశాడు దర్శకుడు. అయితే ఫస్టాఫ్ లో ఉన్నంత కామెడీ డోస్ సెకాంఢాఫ్ లో కనిపించదు. కానీ క్లైమాక్స్ నవీన్ పొలిశెట్టి చెప్పే డైలాగ్స్ తో హైప్ తీసుకొచ్చారు.

ఎవరెలా చేశారంటే ?
చాలా సింపుల్ క‌థ‌. ప‌ర‌మానంద‌య్య శిష్యుల క‌థ టైపు. స‌ర‌దా స‌న్నివేశాలు బాగా రాసుకోవ‌డం వ‌ల్ల‌… కాల‌క్షేపం అయిపోతుంది. నవీన్ పొలిశెట్టి కామెడీ టైమింగ్ అదిరిపోయింది. ఆయనకు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి చక్కని సహకారం అందించారు. ఈ ముగ్గురుకి కూడా ప్రత్యేకమైన మేనర్జిజం పెట్టారు.హీరోయిన్ బొద్దుగా ఉంది. ముర‌ళీశ‌ర్మ ఓకే అనిపిస్తాడు. న‌రేష్, త‌నికెళ్ల భ‌ర‌ణి బాగా నటించారు.

సాంకేతికంగా :
రదన్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయ్. సిద్దం మనోహర్ కెమెరా పనితనం బాగుంది. అభినవ్ రెడ్డి ఇంకాస్త కత్తెరకు పని చెప్పాల్సింది. సెకాంఢాఫ్ లో సినిమా కాస్త నెమ్మదిగా సాగినట్టు అనిపించింది. నిర్మాణ విలువలు బాగున్నాయ్.

ప్లస్ పాయింట్స్ :

  • వినోదం
  • నవిన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శిల నటన
  • సంగీతం
  • సినిమాటోగ్రఫీ
    మైనస్ పాయింట్స్ :
  • సెకాంఢాఫ్
  • అక్కడక్కడ సాగదీత
  • ఫైనల్ గా : జాతి రత్నాలు.. నవ్వులని పంచే రత్నాలు
  • రేటింగ్ : 3.5/5