కృష్ణవంశీ కొత్త సినిమా ‘అన్నం’.. టైటిల్ పోస్టర్ తోనే షాక్ !

క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ సడెన్ షాక్ ఇచ్చారు. ‘అన్నం’ టైటిల్ తో కొత్త సినిమాని ప్రకటించారు. టైటిల్ పోస్టర్ లో తన క్రియేటివిటినీ మొత్తం చూపించేశారు. అరటాకులో అన్నంతో ‘అన్నం’ టైటిల్ దాని కింద ‘పరబ్రహ్మ స్వరూపం’ అనేది ట్యాగ్ లైన్. అదే పల్లెంలో కత్తి, రక్తం, మంగళ సూత్రం ఉంచారు. ఇక పోస్టర్ లో కాల్ మణి, లాండ్ మాఫియా.. ఇలా స్టోరీ లైన్ హింట్ ఇచ్చేశారు. పోస్టర్ తోనే ఇదీ.. కృష్ణవంశీ సినిమా అనే హింట్ ఇచ్చేశారు.


ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు కృష్ణవంశీ. ఆయన నుంచి సింధూరం, అంత:పురం, ఖడ్గం, మురారి, గులాభి, నిన్నే పెళ్లాడతా, చందమామ.. లాంటి క్రియేటివ్ సినిమాలొచ్చాయ్. అలాంటి వంశీలో క్రియేటివ్ మిస్సయి చాన్నాళ్లయింది. అయితే అన్నం – పరబ్రహ్మ స్వరూపంతో వంశీలోని క్రియేటివిటీ మళ్లీ మేల్కొన్నట్టుంది. టైటిల్ పోస్టర్ తోనే.. ఇదీ కదా వంశీ సినిమా అన్నట్టుగా ఉంది. మరీ.. వంశీ క్రియేటివిటీ పోస్టర్స్ కే పరిమితం అవుతుందా ? సినిమాల్లోనూ ఉంటుందా ? అన్నది చూడాలి. ప్రస్తుతం కృష్ణవంశీ రంగమార్తాండ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తికాగానే అన్నం సినిమా ప్రారంభం కానుంది.