#PSPK27 First Look Glimpse వచ్చేస్తోందోచ్ !!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. అభిమానులకు పవన్ మహా శివరాత్రి కానుక అందించనున్నారు. క్రిష్ దర్శకత్వంలో పవన్ నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ని ఈ సాయంత్రం 5:19 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది. దీంతో పవన్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా కోసం ‘హరి హర వీరమల్లు’ టైటిల్ ఫిక్సయినట్టు తెలిసింది. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ బందీపోటుగా కనిపిస్తారని సమాచారమ్. ధనవంతులని దోచుకొని.. పేదలకు పంచే పాత్రలో పవన్ కనిపిస్తారట. ఈ సినిమా కోసం ఛార్మినార్ లాంటి చారిత్రాత్మక కట్టడాలని సెట్స్ గా వేశారు. ఇక ఫస్ట్ లుక్ గ్లింప్స్ తో పాటుగా సినిమా రిలీజ్ డేటుని కూడా ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయ్.