‘రాధేశ్యామ్’ కొత్త పోస్టర్.. సూపర్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. అది ఒక జన్మలో సరిపోయే ప్రేమకాదు. పునర్జన్మల ప్రేమ అని చెబుతున్నారు. వీరిద్దరు జంటగా నటిస్తున్న ప్రేమకథా చిత్రం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ దర్శకుడు. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిన ఈ సినిమాని జూలై 30న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌నున్నారు.

 
మహాశివరాత్రి కానుకగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ని విడుదల చేశారు. సూపర్భ్ గా డిజన్ చేశారు. ఈ పోస్టర్ ని చూసి ప్రభాస్ అభిమానులు మురిసిపోతున్నారు. ఈ చిత్రానికి దక్షిణాదిలో జస్టిన్‌ ప్రభాకరన్‌ స్వరాలు అందిస్తుండగా.. హిందీలో మిథున్‌, మనన్‌ భరద్వాజ్‌ ద్వయం సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతోంది.