‘జాతిరత్నాలు’ – స్టయిలీష్ స్టార్ స్పెషల్ రివ్యూ

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ ది గొప్ప మనసు. తనతో పాటు పక్కవారు కూడా ఎదగాలని కోరుకుంటారు. అవసరమైతే వారి ఎదుగుదలకు తనవంతు సాయం చేస్తుంటారు కూడా. అందుకే బన్నీ అంటే ప్రాణమిచ్చే స్నేహితులున్నారు. తాజాగా బన్నీ జాతిరత్నాలు సినిమాలు చూశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్విట్ చేశారు. కేవలం అభినందలు మాత్రమే చెప్పకుండా.. సినిమాపై చిన్నపాటి రివ్యూ కూడా అందజేశారు బన్నీ.


‘గత రాత్రి జాతిరత్నాలు సినిమా చూశాను. చాలా బాగుంది. చిత్రబృందానికి అభినందనలు. ఇటీవల కాలంలో సినిమా చూసి ఇంతగా నవ్వుకున్న సినిమా లేదు. నవీన్ పొలిశెట్టి అద్భుతంగా నటించారు. సెటిల్డ్ గా నటించారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన సూపర్భ్. సంగీతం బాగుంది. సినిమాని రిచ్ గా ఉందని తెలిపారు. ఆఖరుగా దర్శకుడి అనుదీప్ గురించి చెప్పుకోవాలి. ప్రతి ఒక్కరిని ఎంటర్ టైన్ చేశారు. మీ మైండ్ ని స్వీచ్ఛాప్ చేయండి. సినిమా చూడండి. ఫన్ ని ఎంజాయ్ చేయండి’ అంటూ బన్నీ వరుస ట్విట్ చేశారు.


నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో ‘జాతిరత్నాలు’ తెరకెక్కిఈంది. అనుదీప్ దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ కథ-స్క్రీన్ ప్లే అందించారు. నిర్మాత కూడా నాగ్ అశ్విన్ నే. మహా శివరాత్రి కానుకగా గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన జాతిరత్నాలు హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి నుంచి చివర వరకు నవ్వించేశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. లాజిక్ లని పట్టించుకోకుంటే ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చు. వినోదం, పంచ్ డైలాగ్స్, నవీన్ పొలిశెట్టి, రాహుల్, ప్రియదర్శి నటన  హైలైట్ గా  నిలిచిందని చెప్పుకుంటున్నారు. 

Watched #JathiRatnalu last night . Congratulations to the whole team. Hilarious movie. I haven’t laughed soo much in recent years that much. @NaveenPolishety rocked the show with stellar performance. Rise of a new age stunning performer. @eyrahul was brilliant and effortless.— Allu Arjun (@alluarjun) March 12, 2021