మరో రెండో నగరాల్లోనూ లాక్డౌన్ ప్రకటించిన మహా సర్కార్
దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయ్. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రెండు నగరాల్లోనూ లాక్డౌన్ ప్రకటించారు. అకోలా, పర్భణిలోనూ లాక్డౌన్ విధించారు. ఈ రెండు నగరాలతో పాటు.. పూణెలో నైట్ కర్ఫ్యూను విధిస్తున్నట్లు తెలిపారు.
మహారాష్ట్రలో గత కొద్దిరోజులుగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు బయటపడుతున్నాయి. గురువారం ఒక్కరోజే అక్కడ 14,317 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 22,66,374కు పెరిగింది. ఇక నిన్న మరో 57 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో కేసులు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తూ వెళ్తున్నారు.