ఔరంగజేబు చెల్లెలుగా.. జాక్వెలిన్ ?

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరి హర వీరమల్లు’.  ఇందులో పవన్‌కల్యాణ్‌ వజ్రాలదొంగగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. పవన్‌ సరసన నిధి అగర్వాల్‌ సందడి చేయనుంది. మహాశివరాత్రి కానుకగా గురువారం ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌ గ్లిమ్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఫస్ట్ గ్లిప్స్ అదిరిపోయిందని అభిమానులు, సినీ ప్రముఖులు కితాబిచ్చారు. ఇదివరకెప్పుడు పవర్ స్టార్ ని ఇలా చూడలేదని మురిసిపోయారు. 


తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట్లో వైరల్‌గా మారింది. మొఘల్‌ సామ్రాజ్య చక్రవర్తి ఔరంగజేబు కాలం నాటి కథతో ఈ పీరియాడికల్‌ డ్రామా రూపుదిద్దుకుంటున్నట్లు సమాచారం. అలాగే, ఔరంగజేబు పాత్రలో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ నటించనున్నారట. అలాగే ఆయన సోదరిగా బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ కనిపించనున్నారని సమాచారం. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా హరిహర వీరమల్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.