తెలంగాణలో ప్రారంభమైన స్వాతంత్య్ర సంబురాలు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్’ మహోత్సవ్’ పేరిట కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉత్సవాలని నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాలను తెలంగాణలోనూ ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం రూ.25 కోట్లు కేటాయించినట్లు సీఎం తెలిపారు. ఈరోజు (మార్చి 12) నుంచి 2022 ఆగస్టు 15వ వరకు 75 వారాల పాటు నిర్వహించనున్న మహోత్సవాలకు నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని నియమించారు.
తాజాగా తెలంగాణలో స్వాతంత్య్ర సంబరాలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ”భారత స్వాతంత్య్ర చరిత్ర ప్రపంచ పోరాటాల చరిత్రలోనే ఒక మహోజ్వల ఘట్టం” అని వివరించారు. ఇక హన్మకొండలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన స్వాంతంత్య్ర సంబురాల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. జాతీయ పతాకావిష్కరణ, పోలీస్ మార్చ్, గాలిలో బెలూన్లు వదలడం, దేశభక్తి కార్యక్రమాలు నిర్వహించారు.
Live: CM Sri KCR participating in ‘Azadi Ka Amrut Mahotsav’ at Public Gardens. #AmritMahotsav https://t.co/aJrXCin02E— Telangana CMO (@TelanganaCMO) March 12, 2021