ఆదిపురుష్.. హీరోయిన్ ఫిక్స్ !

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తొలి స్ట్రయిట్ బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’. ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రామాయణ యుద్ధకాండగా ‘ఆదిపురుష్’ తెరకెక్కనుంది. ఇందులో రాముడి పాత్రలో ప్రభాస్, రావణాసురుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు.

ఇక సీత పాత్రలో కనిపించనున్న హీరోయిన్ ఎవరు ? అన్నది ఆసక్తిగా మారింది.
సీత పాత్ర కోసం పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. అనుష్క శెట్టి, కీర్తిసురేశ్‌ పేర్లు కూడా వినిపించాయి. ఫైనల్ గా ఆ అవకాశాన్ని బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ దక్కించుకున్నారు. ఆమె పేరుని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. చిత్రబృందంతో ఆమె దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. అలాగే, బాలీవుడ్‌ నటుడు సన్నీసింగ్‌ లక్ష్మణుడిగా నటించనున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. రాధేశ్యామ్, సలార్, ఆదిపురుష్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇవేకాకుండా నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ సినిమాల్లోనూ ప్రభాస్ నటించనున్నారు. ఇవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే. భారీ బడ్జెట్ సినిమాలే. ఈ సినిమాలన్నీ రిలీజైతే.. ప్రభాస్ బాలీవుడ్ లోనూ స్టార్ హీరో అనిపించుకోవడం ఖాయమని చెబుతున్నారు.