తొలి టీ20.. ఆ మూడు హైలైట్!

ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమ్‌ఇండియా ఘోరంగా ఓడింది. టాస్ ఓడి మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.ఆపై ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి అలవోకగా లక్ష్యాన్ని ఛేదించింది. 15.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేశారు. దీంతో ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 1-0 ఆదిక్యం సంపాదించింది. పరుగులు చేయడానికి టీమిండియా బ్యాట్స్ మెన్స్ కిందా మీదా పడిన పిచ్ పైనే ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్స్ అలవోకగా ఆడటం విశేషం.

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడినా.. ముచ్చట గొలిపే మూడు సన్నివేశాలు చోటు చేసుకున్నాయ్. ఆర్చర్ వేసిన బౌలింగ్ లో పంత్ కొట్టిన సిక్స్ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. హార్థిక్ పాండే కొట్టిన ఫోర్ కూడా ఆకట్టుకుంది. ఇక ఫీల్డింగ్ లో కె ఎల్ రాహుల్ బట్లర్ కొట్టిన భారీ షాట్‌ను రాహుల్ బౌండరీ దగ్గర ఎగురుతూ గాల్లో క్యాచ్ అందుకున్నాడు. అయితే.. అతడు నియంత్రణ కోల్పోయి బౌండరీ అవతలకి పడిపోయాడు. కానీ పడిపోయే ముందే బంతిని మైదానంలోకి విసిరేసి జట్టుకు నాలుగు పరుగులు ఆదా చేశాడు. కచ్చితంగా సిక్స్ అనుకున్న షాట్‌ను రాహుల్ ఆపిన తీరుకు అభిమానులు ముగ్ధులైపోయారు. మ్యాచ్ లో చోటు చేసుకున్న ఈ మూడు హైలైట్స్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Where Are U ! I Am Here 💥🤤#KLRahul pic.twitter.com/dFldjDBxDV— ❗ (@imVKohliOne8) March 13, 2021