బైడన్ కీలక నిర్ణయం.. ప్రవాసీయులు ఖుషి !
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవాసీయులని ఖుషి చేశారు. హెచ్-1బీ వీసాపై అమెరికాలో పనిచేసే విదేశీ నిపుణుల కనీస వేతనాలను భారీగా పెంచుతూ ట్రంప్ సర్కారు నిబంధన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. స్వదేశీయులను మెప్పించడానికి ట్రంప్ విదేశీ నిపుణులకు కనీస వేతన నిబంధనను తీసుకొచ్చారు. దీనివల్ల సంస్థలు వేతనాల భారం తగ్గించుకోవడానికి విదేశీ ఉద్యోగుల స్థానంలో స్వదేశీయులను నియమించుకోవడానికి మొగ్గు చూపుతాయన్నది ఆయన వాదన.
తాజాగా ఈ నిబంధన అమలును మరింత జాప్యం చేస్తూ బైడన్ సర్కార్ ఉత్తర్వులను జారీ చేశారు. మే 14 వరకూ దాని అమలును నిలిపివేస్తున్నట్లు కార్మిక శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో అమెరికాలో ఉద్యోగాన్ని ఆశించే ప్రవాసీయులకు, ముఖ్యంగా భారతీయులకు పెద్ద ఎత్తున లబ్ధి చేకూరనుంది.