తనని కోలీవుడ్ బ్యాన్ చేసింది

ప్రముఖ సింగర్‌ కార్తిక్‌, వైరముత్తులు తనని మానసిక వేధింపులకు గురి చేశారని 2018లో గాయని చిన్మయి చేసిన ఆరోపణలు అందర్నీ షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చిన్మయిని కోలీవుడ్ బ్యాన్ చేసిందట. తాజాగా చిన్మయి ‘ఇండియాటుడే కాన్‌క్లేవ్‌’లో ముచ్చటించారు. సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు.

” ‘మీటూ’ ఉద్యమం వేదికగా వేధింపులకు గురిచేసిన వాళ్ల పేర్లను బయట పెట్టినందుకు 2018 అక్టోబర్‌ నుంచి రాధారవి, వైరముత్తు.. కోలీవుడ్‌ పరిశ్రమలో నన్ను బ్యాన్‌ చేశారు. రాధారవి నాయకత్వంలోని డబ్బింగ్ యూనియన్ నన్ను నిషేధించింది. నేను దీనిపై చట్టబద్ధంగా పోరాడుతున్నాను. వేధించిన వాళ్ల పేరు బయటపెట్టడం నేరం కాదు.

పలు ఆరోపణలు ఉన్నప్పటికీ వైరముత్తు, రాధారవి సమాజంలో మంచి పేరు ప్రతిష్ఠలు అనుభవిస్తున్నారు. దేవుడి దయ వల్ల తెలుగు, హిందీ, ఇతర ఇండస్ట్రీల్లో గాయని, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా పని చేస్తూ జీవిస్తున్నాను. నన్ను అర్థం చేసుకునే మంచి భర్త, కుటుంబం ఉండడం నా అదృష్టం. మరి, అండగా నిలిచే కుటుంబం లేని మహిళల పరిస్థితి ఏమిటి?” అని చిన్మయి ప్రశ్నించారు.