వైరల్ : హీరోయిన్ మెహ్రీన్ ఎంగేజ్ మెంట్ ఫోటోస్

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మెహ్రీన్ ఓ ఇల్లాలు కాబోతుంది. #BhavyaBishnoiని పెళ్లాడనుంది. శుక్రవారం వీరి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.

‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది మెహ్రీన్. ఆ తర్వాత మహానుభావుడు, రాజా ది గ్రేట్ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంది. హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తూనే హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అయిపోయింది. తెలుగుతో పాటు హిందీ, పంజాబీ సినిమాల్లోనూ మెహ్రీన్ నటించింది. ప్రస్తుతం ఎఫ్3 సినిమాలో నటిస్తున్నారు.



