కాసేపట్లో.. మీడియా ముందుకు తారక్ !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. అలాగని సంచలన ప్రకటన ఏమీ చేయడం లేదు. తారక్ మరోసారి హోస్ట్ అవతారం ఎత్తనున్న సంగతి తెలిసిందే. జెమినీ టీవీలో ప్రసారం కానున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే తారక్ షాడో ఇమేజ్ కూడిన ప్రోమోని జెమినీ టీవీ విడుదల చేసింది. తాజాగా ఈ కార్యక్రమం మీడియా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయ్. మరికాసేపట్లో తారక్ మీడియా ముందుకు రాబోతున్నారు. ఎవరు మీలో కోటిశ్వరులు షో గురించి ప్రేక్షకులకు వివరించనున్నారు. ఈ షో కోసం తారక్ కి భారీ పారితోషికం ఇవ్వనున్నట్టు సమాచారమ్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1కి తారక్ హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అది సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఏపీసోడ్స్ కి కూడా బిగ్ బాస్ యాజమాన్యం తారక్ ని అడిగింది. కానీ ఆయన సినిమాల్లో బిజీ కావడం వలన ఓకే చెప్పలేదు. అయితే బిగ్ బాస్ ని కాదని.. ఎవరు మీలో కోటీశ్వరులు షోకి తారక్ ఓకే చెప్పడం విశేషం. ఇందుకు గల కారణాలని తాజా ప్రెస్ మీట్ లో తారక్ చెబుతాడేమో చూడాలి.
Getting ready for the press conference of #EvaruMeeloKoteeswarulu #EMKonGeminiTV #NTR @tarak9999 pic.twitter.com/XqsV2LZfJt— Vamsi Kaka (@vamsikaka) March 13, 2021