జ్వాలారెడ్డి రికార్డుల జాతర

సినిమాలే కాదు పాటలు రికార్డులకెక్కుతున్నాయ్. సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయ్. టన్నుల కొద్ది వ్యూస్ తెచ్చుకుంటున్నారు. లైకులు, షేర్లతో రికార్డులు సృష్టిస్తున్నాయ్. ‘అల.. వైకుంఠపురంలో’ని పాటలు సృష్టించిన సంచలనం గురించి తెలిసిందే. ఇప్పుడు.. ఇదే దారిలో ఇతర సినిమాల్లోని పాటలు రికార్డులు సృష్టిస్తున్నాయ్. తాజాగా ‘జ్వాలారెడ్డి.. ‘ పాట తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగిపోతోంది. 


సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్-తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘సీటీమార్’. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇటీవలే జ్వాలారెడ్డి సాంగ్ విడుదలైంది. తెలంగాణ ఫోక్ సాంగ్ స్టయిల్ లో సాగిన జ్వాలారెడ్డి 1 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. శంకర్ బాబు, మంగిలి కలిసి పాడారు. రాములో రాముల.. తర్వాత ఆ రేంజ్ లో జ్వాలారెడ్డి ప్రేక్షకులని ఆకట్టుకుంటోంది. ఈ పాటలో తమన్నా వేసిన గ్లామర్ స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయ్.