అసలు ‘హరిహర వీరమల్లు’ పవన్ కాదట !

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. మహా శివరాత్రి కానుకగా వచ్చిన హరిహర వీరమల్లు ఫస్ట్ గ్లింప్స్ అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ ని ఎప్పుడూ చూడని విధంగా పవర్ ఫుల్ గా జానపద కథలో చూపించబోతున్నాడు క్రిష్. ఫస్ట్ గ్లింప్స్ లోనే భారీతనం కనిపించింది. పవన్ అభిమానులతో పాటు.. సినీ ప్రముఖులు హరిహర వీరమల్లు వీరత్వం చూసి ఒకింత షాక్ అయ్యారు.
అయితే ఈ సినిమా వెనక ఆసక్తికర కథనం ఉందట. నిజానికి ఈ కథ పవన్ కళ్యాణ్ కోసం రాసుకున్నది కాదట. ‘కంచె’ సినిమా తర్వాత వరుణ్ తేజ్ తో మరో సినిమా చేయాలని క్రిష్ ఈ కథని రాసుకున్నారట. కానీ ఇంతటి బడ్జెట్ కి వరుణ్ తేజ్ న్యాయం చేయలేడు. సరిపోడని ఆగిపోయారట. ఆ తర్వాత పవర్ స్టార్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడంతో.. ఆయన్ని క్రిష్ ఒప్పించారు. ఫస్ట్ గ్లింప్స్ ని చూస్తే.. పవన్ కెరీర్ లోనే ఓ ప్రత్యేక సినిమాగా హరిహర వీరమల్లు నిలిచేలా ఉంది.