‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తారక్ చేయడానికి కారణలివే !

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు తారక్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.


ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటీ? అని ఓ మీడియా మిత్రుడు అడగగా.. ‘దానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ లేదు. బిగ్ బాస్ చేయడానికి ఏమి కారణాలు లేవు. ఈ షో చేయడానికి కూడా ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. కథ నచ్చితే సినిమా ఎలా చేస్తామో.. కాన్సెప్ట్ నచ్చి ఈ షో చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫార్మెట్ లో ఎలాంటి తేడా లేదు. మీలో ఎవరు కోటీశ్వరులు ఫార్మెట్ లోనే షో ఉంటుందని తారక్ తెలిపారు. తారక్ చెప్పిన మరిన్ని విశేషాలని కింది వీడియోలో చూసేయండీ.. !