సోషల్ మీడియాపై తారక్ కామెంట్స్.. నిరాశలో ఫ్యాన్స్ !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ప్రతి నిత్యం సోషల్ మీడియాలో ఎన్టీఆర్ నామ జపం చేసే అభిమానులున్నారు. మరీ.. వారి పోస్టులు, కామెంట్స్ ని తారక్ చూస్తారా ? ఇదే ప్రశ్నని ఓ మీడియా మిత్రుడు తారక్ ని అడిగారు. తారక్ హోస్ట్ గా జెమినీ టీవీలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రసారం కానున్న సంగతి తెలిసిందే. శనివారం నిర్వహించిన ఈ షో ప్రెస్ మీట్ తారక్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అభిమానుల తరుపున ఓ ప్రశ్న అంటూ ఓ మీడియా మిత్రుడు.. సోషల్ మీడియాపై మీ అభిప్రాయం ఏంటీ ? మీ అభిమానులు పెట్టే పోస్టులు, కామెంట్స్ ని మీరు చూస్తారా ? అని అడిగారు. దీనికి తారక్ ఆసక్తికర సమాధానం చెప్పారు. సోషల్ మీడియా లాంటి ఊహా జనిత ప్రపంచంలో నేను ఉండలేను. అసలు సోషల్ మీడియాలో పెద్దగా టైమ్ వేస్ట్ చేయను. కాకపోతే.. సోషల్ మీడియాలో ఏం జరుగుతుంది ? అభిమానులు ఏం అనుకుంటున్నారు ?? అన్నది నా టీమ్ సభ్యులు చెబుతుంటారని తెలిపారు. దీంతో.. తాము కష్టపడి పెడుతున్న పోస్టులని ఇష్టమైన హీరో చూడటం లేదనే బాధలోకి అభిమానులు వెళ్లిపోయారని తెలుస్తోంది.
ప్రస్తుతం తారక్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో కొమరం భీమ్ పాత్రలో తారక్ కనిపించనున్నారు. ఆయనకి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఓలివియా మోరీస్ నటిస్తున్నారు. మరో కథానాయకుడుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ కనిపించారు. ఆయనకి జంటగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. వచ్చే యేడాది సంక్రాంతి కానుకగా ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తారక్, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమాలు ఉండనున్నాయి.
‘ఎవరు మీలో కోటీశ్వరులు’ తారక్ చేయడానికి కారణలివే !
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి హోస్ట్ గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి హోస్ట్ గా వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ షో జెమినీ టీవీలో ప్రసారం కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు షో ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో మీడియా మిత్రులు అడిగిన పలు ప్రశ్నలకు తారక్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు.
ఈ కార్యక్రమాన్ని ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటీ? అని ఓ మీడియా మిత్రుడు అడగగా.. ‘దానికి ప్రత్యేకమైన కారణాలు అంటూ ఏమీ లేదు. బిగ్ బాస్ చేయడానికి ఏమి కారణాలు లేవు. ఈ షో చేయడానికి కూడా ప్రత్యేకమైన కారణాలేమీ లేవు. కథ నచ్చితే సినిమా ఎలా చేస్తామో.. కాన్సెప్ట్ నచ్చి ఈ షో చేయడం జరుగుతుందని తెలిపారు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు షో ఫార్మెట్ లో ఎలాంటి తేడా లేదు. మీలో ఎవరు కోటీశ్వరులు ఫార్మెట్ లోనే షో ఉంటుందని తారక్ తెలిపారు. తారక్ చెప్పిన మరిన్ని విశేషాలని కింది వీడియోలో చూసేయండీ.. !