ఓటు వేసిన కేటీఆర్

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాలకు గాను పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. 

ఈ ఉదయం మంత్రి కేటీఆర్ షేక్‌పేటలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటుహక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..  రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ప్రజలకు మంచి చేయగల, సమస్యలు పరిష్కరించే అభ్యర్థికే ఓటు వేశానని చెప్పారు. 

తప్పకుండా విద్యావంతులంతా ఎన్నికల్లో ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గ పరిధిలో 39శాతమే పోలింగ్‌ జరిగిందని, ఈ సారి పోలింగ్‌ శాతం పెరగాలని ఆకాంక్షించారు. విద్యావంతులంతా ఓటుహక్కును వినియోగించుకొని మిగతా వారికి ఆదర్శంగా నిలువాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి @KTRTRS pic.twitter.com/DIHxnbfw2z— KTR News (@KTR_News) March 14, 2021