పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు : ఒక్క ఓటు రేటు రూ. 10వేలు
తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. అయితే పట్టభద్రులని కొనే కార్యక్రమాన్ని నిన్నటి నుంచే మొదలెట్టారు. ఒక్కో ఓటరుకు రూ. 2 వేల నుంచి రూ. 10 వరకు ఇస్తున్నట్టు సమాచారమ్. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానం నుంచి బరిలో ఉన్న అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి నుంచి గ్రామాలకి భారీగా నగదు అందింది. గ్రామశాఖ అధ్యక్షులు, తెరాస సర్పంచ్ లు అభ్యర్థులకు డబ్బులు పంచుతున్నారు. గ్రామాల్లో అయితే ఒక్కో ఓటరు రూ. 1000 నుంచి రూ. 5000, మండల, పట్టణ ప్రాంతాల్లో ఆ రేటు మరింత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. పట్టభద్రులు కూడా ఏమాత్రం మొహమాట పడకుండా డబ్బులు తీసుకుంటున్నారు. ఓటు మాత్రం తమకు ఇష్టమైన వారికి వేస్తామని చెబుతున్నట్టు తెలిసింది.